Dailyhunt
వెబ్ సిరీస్ చూసి భర్తను చంపిన భార్య.. ఆపై ఏం చేసిందో తెలుసా!

వెబ్ సిరీస్ చూసి భర్తను చంపిన భార్య.. ఆపై ఏం చేసిందో తెలుసా!

వార్త 3 weeks ago

Kurnool Crime: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ శివారులో ఈ నెల 23న లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు విచారణలో తేలింది.

Read Also: Road Safety Awareness Choutkur: మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ప్రాణాలకు ముప్పు - SI వెంకటేశం

వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది

ఎమ్మిగనూరుకు చెందిన పద్మకు, పెద్దనెలాటూరుకు చెందిన నరేంద్రకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, నరేంద్ర పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో పద్మకు అదే గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భర్త నరేంద్ర పలుమార్లు మందలించినా, పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా పద్మ ప్రవర్తనలో మార్పు రాలేదు.

 Emmiganur Husband Murder Case

కాపురం మార్చినా మారని వైనం

భార్యను మార్చుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర తన కాపురాన్ని ఎమ్మిగనూరుకు మార్చారు. అయినప్పటికీ పద్మ తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. భర్త పనికి వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్లాయి. అయితే నరేంద్ర కాపురం చేద్దామని కోరగా, భర్త బ్రతికి ఉంటే తాము సుఖంగా ఉండలేమని భావించిన పద్మ, ప్రియుడు వంశీతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది.

Kurnool Crime: వెబ్ సిరీస్ ప్రేరణతో పక్కా ప్లాన్

ఆమె వెబ్ సిరీస్ లు చూసి, హత్య చేసి దొరక్కుండా ఎలా తప్పించుకోవచ్చో నేర్చుకుంది. దీంతో పథకం ప్రకారం నిద్రిస్తున్న నరేంద్ర గొంతును ప్రియుడు వంశీతో కలిసి నులిమి చంపేసింది.పథకం ప్రకారం ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను గొంతునులిమి హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని ఊరి శివారులో ఉన్న పోలాల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసింది. మరుసటి ఉదయం పొలంలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగా భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌కు సైబర్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha