Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

వార్త 3 days ago

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

మధ్య బంగాళాఖాతం నుండి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఒక ద్రోణి (Trough) విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే రాష్ట్రంలో వాతావరణం మారిపోయి వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు.

 APSDMA Rains Warning

ఏయే జిల్లాల్లో వర్ష సూచన ఉందంటే?

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు కింద పేర్కొన్న జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని ఆయన వివరించారు:

  • అల్లూరి సీతారామరాజు, ఏలూరు
  • పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్
  • గుంటూరు, బాపట్ల, పల్నాడు
  • ప్రకాశం, నెల్లూరు

read also:Collectorate AO Chandrasekhar: కలెక్టరేట్ ఏవోగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ!

AP Weather Update: ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు భానుడి భగభగలు:

రాష్ట్రంలో బుధవారం విచిత్రమైన వాతావరణం కనిపించింది. నిన్న సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో అత్యధికంగా 72.5 మి.మీ, లావేరులో 64.5 మి.మీ చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో అనకాపల్లి జిల్లా మకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పరిసరాల్లో గరిష్ఠంగా 44.3 డిగ్రీల మేర రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం.

ఈదురుగాలుల బీభత్సం.. అధికారుల హెచ్చరికలు:

బుధవారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలి వేగానికి పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీనివల్ల చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో వర్ష సూచన ఉన్న జిల్లాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, పోల్స్ కింద ఆశ్రయం పొందవద్దని, బలమైన గాలులు వీస్తున్నప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

అభివృద్ధే అమిలినేని సురేంద్రబాబు అజెండా: టీడీపీ నేతలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha