Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ఏర్పడుతున్న గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాజధాని పేరు స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also:TG Inter Results: ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ అమ్మాయిలు..సీఎం అభినందనలు
Amaravati: ముఖ్యమైన మార్పులు ఇవే
ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక నోట్లు, పత్రాలు, కమ్యూనికేషన్లలో “AMARAVATI” అని మాత్రమే ఉండాలి.ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు చివరిలో ‘THI’ (Amaravathi) కి బదులుగా ‘TI’ (Amaravati) అని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Amaravati Spelling Change
ఎందుకు ఈ నిర్ణయం?
చాలా కాలంగా కొందరు ‘Amaravathi’ అని, మరికొందరు ‘Amaravati’ అని వేర్వేరుగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అధికారిక రికార్డుల్లో ఏకరూపత దెబ్బతింటోంది. అందుకే గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సరైన స్పెల్లింగ్ ‘Amaravati’ అని ప్రభుత్వం నిర్ధారించింది. పురాతన బౌద్ధ క్షేత్రం మరియు చరిత్ర ప్రకారం కూడా ‘అమరావతి’ (Amaravati) అనే పదం సరైనదని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

