Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ రైతులకు శుభవార్త.. ఇకపై 9 గంటల ఉచిత విద్యుత్!

ఏపీ రైతులకు శుభవార్త.. ఇకపై 9 గంటల ఉచిత విద్యుత్!

వార్త 5 days ago

Gottipati Ravikumar: ఏపీలో రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన ఆయన, నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించి కీలక ప్రకటన చేశారు. రైతుల సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నామని, విద్యుత్ సమస్యలు లేకుండా చూడటమే తమ ప్రాధాన్యత అని ఆయన వివరించారు.

Read also: Bhogapuram Airport Updates: త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.. తేదీపై కలెక్టర్ కీలక ప్రకటన

 9-hour power supply substation for agriculture

మెరుగైన విద్యుత్ వ్యవస్థ కోసం కొత్త సబ్ స్టేషన్లు

ఒంగోలు పట్టణంలో లో వోల్టేజ్ సమస్యలను దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సెమీ ఇండోర్ సబ్ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సబ్ స్టేషన్లను నిర్మించి, నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆయన వెల్లడించారు.

Gottipati Ravikumar: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని

రైతులకు సాగులో ఆటంకాలు లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పునరుద్ఘాటించారు. కేవలం విద్యుత్ సదుపాయమే కాకుండా, ఇతర వ్యవసాయ అవసరాలను కూడా తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా, సాగు రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు.

Epaper: epaper.vaartha.com

ఏపీకి మరో గోల్డ్ మైన్.. కుప్పంలో బంగారం గనులు గుర్తింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha