Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

వార్త 2 weeks ago

Rain Alerts: గతవారం కురిసిన వర్షాల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండల తీవ్రత పెరిగింది.

ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ఎల్‌నినో ముప్పు భయపెడుతుండటంతో సాగు చేసిన పంటలు ఎండిపోతాయేమోనని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందించింది.

Read also: Chandrababu Naidu: రేపు 3 లక్షల ఇళ్లకు సీఎం చంద్రబాబు భూమిపూజ

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్ – అండమాన్ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.

కోస్తా, రాయలసీమలో వర్షాలు
ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వర్ష సూచనతో ఎండల తీవ్రత తగ్గి, ఎండిపోతున్న పంటలకు జీవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మత్స్యకారులకు హెచ్చరికలు
సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు.

Epaper: epaper.vaartha.com

విజయవాడలో పాన్ ఐఐటీ సదస్సు.. స్టాళ్లను సందర్శించిన చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha