Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రక అడుగు వేస్తోంది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 3 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి రేపు (ఆదివారం) అధికారికంగా భూమిపూజ కార్యక్రమం జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తెనాలిలో అత్యాధునిక ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు’ శ్రీకారం
ఈ పర్యటనలో భాగంగా గృహ నిర్మాణ రంగంలో సరికొత్త సాంకేతికతకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు’ పనులను కూడా వీరు ప్రారంభించనున్నారు. తక్కువ సమయంలో, అత్యంత నాణ్యతతో కూడిన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ఈ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
బీసీ రిజర్వేషన్లపై వైసీపీకి మాట్లాడే హక్కు లేదు: రామ్మోహన్ నాయుడు

