Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ వైద్య విద్య డైరెక్టర్‌గా డాక్టర్ విష్ణువర్ధన్.. ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏపీ వైద్య విద్య డైరెక్టర్‌గా డాక్టర్ విష్ణువర్ధన్.. ప్రభుత్వం ఉత్తర్వులు!

వార్త 2 months ago

AP Health Department: పి వైద్య, ఆరోగ్యశాఖలో పలువురు అధికారులను బదిలీలు చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కీలకమైన వైద్య విద్య డైరెక్టర్ (డిఎంఇ)గా కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తున్న డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ను ప్రభుత్వం నిర్ణయించింది.

ఇటీవల అదనపు వైద్య విద్య సంచాలకులుగా (ఎడిఎంఇలు) పదోన్నతి పొందిన 15మంది ప్రొఫెసర్లను, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పోస్టింగులు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఎడిఎంఇగా ఉంటూ, గత తొమ్మిదినెలలుగా వైద్య విద్య సంచాలకునిగా (పూర్తి అదనపు బాధ్యతలు) విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రఘునందన్ ఆ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఆయనను విజయవాడ జిజిహెచ్ సూపరింటెండెంట్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read also: Mahanadu 2026 : మహానాడు లో కీలక ప్రకటన - నారా లోకేష్ ట్వీట్

 AP Medical Director Dr Vishnuvardhan

AP Health Department: కీలక అధికారులకు కొత్త పోస్టింగ్ లు

ఈ స్థానానికి గత సంవత్సర కాలంగా ఎడిఎంఇగా రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ విష్ణువర్ధను ఇన్చార్జ్ డిఎంఇగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఏలూరు పభుత్వ సర్వజ నాసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.యస్ రాజు అనారోగ్యం కారణంగా ఆయన కోరిక మేరకు రాజమహేందవ్రరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా బదిలీ కానున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యూరాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కెవివి సత్యనారాయణ మూర్తి, పదోన్నతి అనంతరం డిఎంఇ కార్యాలయంలో అదనపు డిఎంఇగా నియమితులు కానున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పి.ఉషాకిరణ్ ఎడిఎంఇగా పదోన్నతితో అదే కాలేజీ ప్రిన్సిపాల్గా నియమితులు కానున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ దిడిపార్ట్మెంట్గా పనిచేస్తున్న డాక్టర్ వి. మన్మధరావును విశాఖ ఇన్స్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)కు డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

విజయవాడ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha