Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడు లో కీలక ప్రకటన - నారా లోకేష్ ట్వీట్

మహానాడు లో కీలక ప్రకటన - నారా లోకేష్ ట్వీట్

వార్త 2 weeks ago

Mahanadu 2026 : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ 'మహానాడు' వేదికగా ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ రోజు మహానాడు సభలో తాను ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ (కీలక ప్రకటన) చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.

పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను స్వీకరించిన తర్వాత.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) హోదాలో తాను తొలిసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిణామంతో తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలలో ఒక్కసారిగా ఉత్కంఠతో పాటు భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Read Also : AP EAPCET ఫలితాలు ఎప్పుడంటే?

 TDP Mahanadu 2026

సస్పెన్స్ రేపుతున్న లోకేష్ ట్వీట్ – ఆ ‘బిగ్ అనౌన్స్‌మెంట్’ ఏమై ఉంటుంది?

మహానాడు వేదికగా నారా లోకేష్ చేయబోయే ఆ పెద్ద ప్రకటన ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. “నా నుంచి రాబోయే ఆ బిగ్ అనౌన్స్‌మెంట్ కోసం కాస్త వేచి చూడండి” అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పార్టీ యువనేతగా, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేష్.. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోబోయే విప్లవాత్మక మార్పుల గురించా, యువతకు ఇచ్చే ప్రాధాన్యత గురించా లేదా ఏపీ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ఏదైనా సరికొత్త విధానాన్ని ప్రకటించబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన చేయబోయే ప్రసంగం టీడీపీ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్దేశించనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha