AP Weather update:నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో, తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందింది. ప్రస్తుతం ఈ రుతుపవనాలు రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి.
దీని ప్రభావంతో నేడు శుక్రవారం ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి.
Read also:Hyderabad Heatwave: అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌తో నిప్పుల కొలిమిలా సిటీ!
Heavy rain in Andhra Pradesh
వర్ష సూచన ఉన్న జిల్లాల వివరాలు
వాతావరణ శాఖ సూచనల ప్రకారం చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అదే విధంగా నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
AP Weather update:మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక
తీరప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత వాసులు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. రైతులు కూడా తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

