Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్!

ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్!

వార్త 1 week ago

Reliance AP Investment: ఆంధ్రప్రదేశ్‌కు మరో మైలురాయి లాంటి భారీ పారిశ్రామిక పెట్టుబడి రాబోతోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఏపీలో ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో ఏలూరు జిల్లాలోని చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనులను రిలయన్స్ దక్కించుకుంది. అక్కడ దేశంలోనే మొదటి సరికొత్త సాంకేతికతతో కూడిన అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (Underground Coal Gasification) ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది.

Read Also :PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన వేళ గిఫ్ట్.. మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!

3,130 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు - ఆధునిక సాంకేతికత

ఏలూరు జిల్లాలోని ఈ గనుల్లో భారీ ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

  • చింతలపూడి బ్లాక్: 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్ టన్నుల (G-12 రకం) బొగ్గు నిల్వలు.
  • రేచెర్ల బ్లాక్: 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్ టన్నుల (G-13 రకం) బొగ్గు నిల్వలు.
  • మొత్తం నిల్వలు: 3,130.61 మిలియన్ టన్నులు.

భారీ లోతులో ఉన్న ఈ బొగ్గును సాంప్రదాయ పద్ధతిలో తవ్వి తీయడం ఖర్చుతో కూడుకున్నందున, నేరుగా భూగర్భంలోనే మండించి సింథటిక్ గ్యాస్ (Syngas), అమ్మోనియా, అమ్మోనియం నైట్రేట్‌లను ఉత్పత్తి చేస్తారు. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ భావిస్తోంది.

Reliance AP Investment: విజయనగరంలో రూ.1.08 లక్షల కోట్లతో AI డేటా సెంటర్

కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌తో పాటు ఏపీలో రిలయన్స్ మరొక మెగా ప్రాజెక్ట్‌పై దృష్టి సారించింది. రూ.1,08,010 కోట్ల వ్యయంతో విజయనగరం జిల్లాలో 1.5 గిగావాట్ల (GW) సామర్థ్యంతో గిగా-స్కేల్ AI డేటా సెంటర్‌ను (AIDC) నిర్మించనుంది. మొదటి దశలో రూ.45,610 కోట్లు, రెండో దశలో రూ.62,400 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, ప్రభుత్వం విజయనగరంలో 853.97 ఎకరాల భూమిని సేకరించింది. ఈ రెండు మెగా ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఏపీలో 18 విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల రద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha