AP Universities:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 యూనివర్శిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలానికి నియమించిన ఈ పాలకమండళ్లలోని నామినేటెడ్ సభ్యుల పదవులను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అయితే విశ్వవిద్యాలయాల పరిపాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఆచార్య నాగార్జున, ఎస్వీయూ, ఆంధ్రా యూనివర్సిటీ సహా కొన్ని ముఖ్యమైన వర్శిటీలకు కొత్త కౌన్సిళ్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.
Read also: YS Anand Reddy: వైఎస్ జగన్ పెదనాన్న ఆనంద్ రెడ్డి కన్నుమూత
AP 18 Universities Executive Council
క్లాజ్ నిబంధనల ఆధారంగా సభ్యుల తొలగింపు
విశ్వవిద్యాలయాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేపట్టింది. యూనివర్శిటీ చట్టంలోని క్లాజ్ 1 కింద పదవీ రీత్యా కొనసాగే సభ్యులు యథావిధిగా తమ విధుల్లో కొనసాగుతారని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కేవలం క్లాజ్ 2 కింద ప్రభుత్వం గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవులను మాత్రమే తక్షణమే రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పుల ద్వారా విశ్వవిద్యాలయాల పరిపాలనా వ్యవహారాలలో పారదర్శకతను పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.
AP Universities:విద్యారంగంలో నూతన సంస్కరణలు
రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు రకాల ఆధునిక చర్యలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆరో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. అలాగే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించడానికి ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్లు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని నిపుణులు పేర్కొంటున్నారు.
Epaper: epaper.vaartha.com

