Rain Alert:ఆంధ్రప్రదేశ్‌ను వాయుగుండం ముప్పు కమ్ముకుంటోంది. తూర్పు బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది సోమవారానికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Local Body Elections : స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు.. SECకి కూటమి ఫిర్యాదు
మచిలీపట్నం – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయానికి తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జిల్లాల వారీగా హెచ్చరికలు
తుఫాను తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు గల తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు (మన్యం), విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ప్రజలకు, మత్స్యకారులకు అధికారిక హెచ్చరికలు
వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని, సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి చేరుకోవాలని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

