Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం

ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం

వార్త 2 weeks ago

ఏపీలో బోర్ల తవ్వకాలపై నిషేధం

AP Borewell Ban : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలను పూర్తిగా నిషేధించింది.

ఏపీలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి వినియోగం అధికంగా ఉండి భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోయిన గ్రామాలను గుర్తించిన అధికారులు, 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్తగా బోర్ల తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే చేతి బోర్లకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామాల్లో వ్యవసాయ, వాణిజ్య అవసరాలకు కొత్త బోర్లు వేయడంపై మాత్రమే కాకుండా ఇసుక తవ్వకాలపైనా నిషేధం విధించారు.

7 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం

అధికారుల లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 76 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 91 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 20 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 8 గ్రామాలు, అనంతపురం జిల్లాలో 14 గ్రామాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు, కడప జిల్లాలో 10 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read Also ; తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అతిథుల జాబితాలో ప్రముఖులు!

 AP Borewell Ban

రైతులకు వ్యవసాయశాఖ సూచనలు

మరోవైపు ఖరీఫ్ సీజన్‌కు రైతులను సిద్ధం చేసే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది ప్రాజెక్టుల నుంచి నీటిని ముందుగానే విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులు ఖరీఫ్ సాగును కూడా త్వరగా ప్రారంభించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సూచించారు.

జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ముందస్తు సాగు వల్ల పంట కోత సమయంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రతి రైతు ఫార్మర్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని, ఏపీ ఎయిమ్స్ యాప్‌ను ప్రతిరోజూ పరిశీలించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నుంచి గతేడాది కంటే ముందుగానే నీటిని విడుదల చేశారని, ఈ నెల 25వ తేదీలోగా వరి నాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నేడు తెలంగాణ కు మోడీ రాక ..పూర్తి షెడ్యూల్ ఇదే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha