Vijay Oath: తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత సి.జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మద్దతు ఇస్తున్న మిత్రపక్షాల లేఖలతో శనివారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ కలిశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు గవర్నర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మే 13వ తేదీలోగా అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.
Read Also: Happy Mothers Day 2026: అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే అద్భుతమైన మాటలు!
ప్రమాణ స్వీకార వేదిక, సమయం
చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, విజయ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ నేరుగా అధికారాన్ని చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Thalapathy Vijay Swearing In
Vijay Oath: అతిథుల జాబితాలో ప్రముఖులు
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవ్యాప్త గుర్తింపు ఉన్న రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర స్థాయి నాయకులు, దక్షిణాది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. సమయాభావం కారణంగా కేవలం కొద్దిమంది ముఖ్య అతిథులను మాత్రమే విజయ్ వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం ఆహ్వానం!

