Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో అలాయ్-బలాయ్ పెట్టాలంటూ వీహెచ్ సూచన

ఏపీలో అలాయ్-బలాయ్ పెట్టాలంటూ వీహెచ్ సూచన

వార్త 2 days ago

Alai-Balai : హర్యానా మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ ప్రతీ ఏటా దసరా పండగ సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహించే 'అలాయ్-బలాయ్' కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.

హనుమంతరావు (వీహెచ్) పాల్గొని సందడి చేశారు. ఈ వేదికపై ఆయన మాట్లాడిన మాటలు సభలో నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపజేశాయి. తెలంగాణ రాజకీయంలో ఎన్ని విమర్శలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. అంతిమంగా ఒక పండగో, కార్యక్రమో వస్తే అందరం ఒకచోట చేరి ఆత్మీయంగా కలుసుకునే గొప్ప సంస్కృతి తెలంగాణకు ఉందని వీహెచ్ గుర్తుచేశారు. ఈ సోదరభావాన్ని ప్రతిబింబించే అలాయ్-బలాయ్ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌కి కూడా విస్తరించాలని ఆయన బండారు దత్తాత్రేయకు సూచించారు.

కడప, కర్నూలుల్లోనూ ‘అలాయ్-బలాయ్’ పెట్టాలి: వీహెచ్ మార్క్ సరదా వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాలు, అక్కడి పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించిన వీహెచ్.. “మా తెలంగాణలో కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ ఒక దగ్గరై కలుసుకుంటాం. కానీ కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో ఒకసారి గొడవలు పడితే ఎన్నేళ్లయినా, చచ్చినా కలవరు. అంతా పొడుచుకునుడు, చంపుకునుడే ఉంటది” అని నవ్వులు పూయిస్తూ వ్యాఖ్యానించారు. అందుకే రాయలసీమతో పాటు కోస్తా జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు ప్రాంతాల్లో కూడా ‘అలాయ్-బలాయ్’ లాంటి ఆత్మీయ కలయికల వేడుకను ఏర్పాటు చేసి, ప్రజలు మరియు నాయకుల మధ్య ఉన్న వైరి వర్గ భావాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేయాలని వీహెచ్ దత్తాత్రేయను కోరారు.

రూ.20 నీళ్ల బాటిల్ కోసం నిండు ప్రాణం బలి: విజయవాడలో అమానవీయ ఘటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha