Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో భారీ పెట్రో ప్రాజెక్టుకు కీలక ముందడుగు

ఏపీలో భారీ పెట్రో ప్రాజెక్టుకు కీలక ముందడుగు

వార్త 2 weeks ago

BPCL Ramayapatnam Refinery: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి కీలక గుడ్‌న్యూస్ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో భారీ పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి.

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కీలక అనుమతుల ప్రక్రియలో ముందడుగు పడింది.

Jal Jeevan Mission 2 0: ప్రొద్దుటూరులో 'అమరజీవి జలధార'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రూ.1.03 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టు

రామాయపట్నం పోర్టు సమీపంలో సుమారు 5,200 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని BPCL ప్రతిపాదించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1.03 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతో పాటు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) అనుమతులు మంజూరు చేయాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ సిఫారసుల తర్వాత తుది అనుమతులు లభిస్తే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.

5,200 ఎకరాల్లో రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్

ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన 5,200 ఎకరాల్లో సుమారు 1,563 ఎకరాలను గ్రీన్‌ఫీల్డ్ బెల్ట్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం సుమారు రూ.3,022 కోట్లు కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుండటంతో ఉత్పత్తుల రవాణాకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ఏఏ ఉత్పత్తులు తయారు చేస్తారు?

ఈ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా..

  • పెట్రోల్
  • డీజిల్
  • ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)
  • నాఫ్తా
  • LPG
  • బిటుమెన్

వంటి ఉత్పత్తులు ఉంటాయి.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 5.4 మిలియన్ టన్నుల రవాణా ఇంధనాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అలాగే మరో 3.2 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా సుమారు 1,250 మందికి, పరోక్షంగా మరో 3,750 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణతో పాటు అనుబంధ పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అంచనా.

BPCL Ramayapatnam Refinery: నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం?

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రామాయపట్నం వద్ద BPCL ప్రతిపాదించిన ప్రాజెక్టుపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా EAC పర్యావరణ, CRZ అనుమతుల విషయంలో సిఫారసు చేయడంతో ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. తుది అనుమతులు లభించిన తర్వాత BPCL తదుపరి కార్యాచరణను వేగవంతం చేసి నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉంది.

Epaper: epaper.vaartha.com

ఏపీలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha