AP Sea Fishing Ban: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో సముద్ర జీవ సంపద పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం వార్షిక చేపల వేట నిషేధాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 15 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంటుంది.
Read Also:Singanamala: ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
AP Sea Fishing Ban: ఎందుకు ఈ నిషేధం?
సంతానోత్పత్తి కోసమే ఈ విరామం ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల మధ్య కాలం చేపలు, ఇతర సముద్ర జీవుల సంతానోత్పత్తికి అత్యంత కీలకమైన సమయం. ఈ నేపథ్యంలో సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఈ వేట విరామాన్ని ప్రకటిస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి వేటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 వేల జరిమానాతో పాటు వారి వలలను స్వాధీనం చేసుకుని, బోటు రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు.
AP Sea Fishing Ban April 15 to June 14 2026
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఈ చేపల వేట విరామ సమయంలో.. మత్స్యకారుల సేవలో పథకం కింద ఏడాదికి రూ.20వేలు అందిస్తోంది. గతేడాది అర్హులైన మత్స్యకారులకు ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేశారు. ఈ మేరకు మత్స్యకారులకు రూ.20వేల సాయం అందించేందుకు లబ్ధిదారుల వివరాలను సేకరించనున్నారు. ఈ నెల 17 నుంచి అర్హులైన మత్స్యకారుల వివరాలు సేకరించనున్నారు. అంతేకాదు ప్రభుత్వం వేటకు వెళ్లే బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ కూడా అందిస్తోంది. అలాగే రాయితీపై మత్స్యకారులకు ఇంజిన్, తెప్ప, వల కూడా అందిస్తున్నారు. మత్స్యకారులకు 40% రాయితీపై మోటార్ ఇంజిన్లు అందజేస్తున్నారు.
ముఖ్యమైన వివరాలు
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని భారీగా పెంచారు. గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఈ బీమాను ఇప్పుడు రూ. 10 లక్షలకు పెంచారు. అలాగే, సాధారణ మరణం లేదా ప్రమాదం సంభవించినా కార్మిక శాఖ ద్వారా రూ. 2 లక్షల పరిహారం అందుతుంది. ఈ బీమా సౌకర్యాలు పొందాలంటే మత్స్యకారులు తప్పనిసరిగా సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. అలాగే, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు కలిగి ఉండి, మత్స్యశాఖ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం సమీపంలోని మత్స్యశాఖ కార్యాలయాలను లేదా గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

