Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

వార్త 2 months ago

నంతపురం జిల్లా శింగనమల(Singanamala) మండకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 200 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు. ప్రజా ప్రతినిధులు. నాయకులతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తుచేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రెండో షార్ట్ లిస్ట్ విడుదల.. ఏప్రిల్ 27లోగా వెరిఫికేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha