Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో ఇంధన సెగ.. రోడ్లపైకి వైసీపీ శ్రేణులు

ఏపీలో ఇంధన సెగ.. రోడ్లపైకి వైసీపీ శ్రేణులు

వార్త 1 month ago

AP Petrol Shortage: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు చోట్ల పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేస్తూ ప్రజల ఇబ్బందులను ఎత్తిచూపారు. అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే సామాన్యులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: BRS Formation Day: రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్

 AP fuel crisis YSRCP protest image.

AP Petrol Shortage: కృత్రిమ కొరతతో దోపిడీ – జగన్ ఘాటు విమర్శలు

ఈ సంక్షోభంపై వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పొరుగు రాష్ట్రాల్లో లేని ఇంధన సమస్య కేవలం ఏపీలోనే ఎందుకుందని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కై స్టాక్ దాచిపెట్టి భారీ లాభాలు గడించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

సంక్షోభంలో రైతాంగం

డీజిల్ కొరత వల్ల రబీ పంట కోతల సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ పేర్కొన్నారు. యంత్రాలు నడవక, ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు ఆగడంతో రైతాంగం ఆందోళనలో ఉందని తెలిపారు. గతంలో విత్తనాలు, ఎరువుల విషయంలో జరిగినట్లే ఇప్పుడు ఇంధనం విషయంలోనూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గత ప్రభుత్వాలు సిక్కిం అభివృద్ధిని అడ్డుకున్నాయి: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha