Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్

రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్

వార్త 1 month ago

ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఏమైంది

BRS Formation Day: మరో రెండేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రానున్నదని, వచ్చే ఎన్నికల నాటికల్లా పార్టీని మరింతగా బలోపేతం చేసేం దుకు కార్యకర్తలు, నాయకులు ఆ దిశగా పనిచేయాలని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు.బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని కోర్పోలు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరిం చిన అనంతరం మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక రెండున్నరేళ్లకే చతికిలపడిందని ఎద్దేవా చేశారు.

Read Also:Indiramma Indlu Scheme: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

BRS Formation Day: కాంగ్రెస్ తీరుపై నిప్పులు

ఆసరా పించన్లను రూ.4 వేలకు పెంచి, వికలాంగులకు రూ.6 వేలు చెల్లిస్తామని, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామని వాగ్దానాలు చేసి ప్రజలకు నిలువనా మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలను వంచించడంలో కాంగ్రెస్ ముందుంటుందని, అబద్దాల కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయలతో పాటు డీఏ, పీఆర్సీ వంటి ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేస్తూ సంపూర్ణంగా అమలు చేశామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

రైతులను శాశ్వతంగా రుణ విముక్తులను చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పుల్కల్, చౌటకూర్, అందోలు మండలాల్లోని 40 వేల ఎకరాల భూమికి సింగూరు జలాలు సరఫరా చేయకుండా దిగువన ఉన్న ఘనపురం ఆయకట్టుకు నీరు విడుదల చేశారని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ఇప్పటికే రెండేళ్లుగా క్రాప్ హాలీడే ప్రకటిం చి రైతుల తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

క్రాప్ హాలీడే ప్రకటనతో రైతులు వరి పంట పండించుకోక ఆర్థికంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే రైతుల వివరాలను సేకరించి ఎకారకు రూ.30 వేలు పరిహారం చెల్లిం చాలని క్రాంతికరణ్ డిమాండ్ చేశారు. ఇదిలావుండగా చౌటకూర్ మండలంలోని వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, సీనియర్ నాకులు దర్శన్రెడ్డి, తుంగె అనంతయ్య, వీరారెడ్డి, శ్రీహరి, అనిల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ధాన్యం కొనలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - కేసీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha