Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో కొత్త పింఛన్లు.. మొదట ఎవరికో తెలుసా?

ఏపీలో కొత్త పింఛన్లు.. మొదట ఎవరికో తెలుసా?

వార్త 2 months ago

కీలక నిర్ణయం

AP pensions : కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించింది.

తొలి ప్రాధాన్యత ఎవరికంటే?

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, జూన్ 12 నుంచి తొలి విడతగా వితంతువులకు పింఛన్లు అందించనున్నారు. ప్రతి అర్హుడికి నెలకు రూ.4,000 చొప్పున ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

ఎంతమందికి లాభం?

అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.53 లక్షల మంది కొత్తగా వితంతు పింఛన్‌కు అర్హులుగా ఉన్నారు. వీరికి పింఛన్లు మంజూరు చేస్తే ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.61 కోట్ల అదనపు భారం పడనుంది.

ఇప్పటికే ఇచ్చిన పింఛన్లు

ప్రభుత్వం 'స్పౌజ్' కేటగిరీ కింద భర్త మరణించిన మహిళలకు వెంటనే పింఛన్ మంజూరు చేస్తోంది. ఈ విధానంలో ఇప్పటివరకు సుమారు 2.30 లక్షల మందికి ప్రయోజనం కలిగింది.

తర్వాత ఎవరికంటే?

వితంతు పింఛన్ల ప్రక్రియ పూర్తయ్యాక, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దాదాపు లక్ష మంది దివ్యాంగులు కొత్తగా దరఖాస్తు చేసినట్లు సమాచారం.

అనర్హుల తొలగింపు

ప్రస్తుతం దివ్యాంగుల కేటగిరీలో 6.50 లక్షల మంది పింఛన్ పొందుతుండగా, వారిలో కొంతమంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. సదరం సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులను మాత్రమే ఎంపిక చేయనున్నారు.

Read Also: AP VOA Incentive Arrears Release 2026: వీవోఏలకు పండగ లాంటి వార్త: రూ. 22.67 కోట్ల బకాయిల విడుదల

 AP pensions

భారీ దరఖాస్తులు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 10 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వంపై భారం

ఈ పింఛన్లన్నింటిని మంజూరు చేస్తే నెలకు సుమారు రూ.400 కోట్లు, ఏడాదికి రూ.4,800 కోట్ల వరకు అదనపు వ్యయం అవుతుంది. అందుకే ప్రభుత్వం దశలవారీగా పింఛన్లు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నెల్లూరు పండ్ల వ్యాపారులకు జేసీ వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha