Dailyhunt
ఏపీలో పలుచోట్ల దంచికొడుతున్న భారీ వర్షాలు

ఏపీలో పలుచోట్ల దంచికొడుతున్న భారీ వర్షాలు

వార్త 6 days ago

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుండే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మోస్తరు వర్షం మొదలైంది. వాతావరణం చల్లబడటంతో ఎండ వేడి నుండి ప్రజలకు ఉపశమనం లభించినా ప్రయాణాలకు ఆటంకం కలిగింది.

Read also: Monsoon 2026 Update: మండిపోతున్న ఎండల మధ్య ఐఎండీ కూల్ అప్‌డేట్.. ఆ తేదీ నుంచి వర్షాలు షురూ!

 Stormy clouds over city landscape

AP Rains: ఈ ప్రాంతాల్లో పిడుగుల హెచ్చరిక

అనకాపల్లి, కాకినాడ సహా కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసే వారు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని సూచించారు. వర్షం పడే సమయంలో బయటకు రాకపోవడం ఉత్తమమని అధికారులు తెలిపారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, పాత గోడలకు దూరంగా ఉండటం మంచిది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షం తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రభుత్వం కోరింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్ష సూచన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha