Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో పెట్రోల్ కష్టాలు.. చంద్రబాబుపై షర్మిల ఘాటు విమర్శలు!

ఏపీలో పెట్రోల్ కష్టాలు.. చంద్రబాబుపై షర్మిల ఘాటు విమర్శలు!

వార్త 1 month ago

AP Petrol Shortage: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క సామాన్యులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని షర్మిల మండిపడ్డారు. కేవలం సమీక్షా సమావేశాలు నిర్వహించడం వల్ల బంకుల్లో ఇంధనం రాదని ఆమె ఎద్దేవా చేశారు.

70 శాతం పెట్రోల్ బంకులు మూతపడటం అంటే అది ప్రభుత్వ అసమర్థతే అని స్పష్టం చేశారు. ఎండల్లో కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ కట్టడం చూస్తుంటే బాధగా ఉందన్నారు.

Read also: Vizag Google Data Center: రేపు గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన

 Sharmila’s Sensational Remarks

AP Petrol Shortage: కూటమి పాలనపై విమర్శలు

దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి పరిస్థితి ఉండటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీకి మద్దతు ఇస్తున్నా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ ఇంధన కొరతను అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని కోరారు. తక్షణమే స్పందించి 24 గంటల్లో సరఫరాను పునరుద్ధరించాలని ఆమె గట్టి హెచ్చరిక జారీ చేశారు.

సామాన్యుడిపై భారం: నిత్యావసరాల ధరలు పెరిగే ఛాన్స్

ఇంధన కొరత ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థ దెబ్బతిని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే మేల్కొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ప్రజల ఇబ్బందులు తీర్చడంపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తాడిపత్రిలో హిజ్రాల వర్గపోరు - ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha