Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన

రేపు గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన

వార్త 1 month ago

Vizag Google Data Center: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఐటీ రంగంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కానుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ (AI) డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.

సుమారు రూ. 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది.

Read Also:Anantapur: బీసీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 Vizag Google Data Center: Foundation stone of Google AI Data Center to be laid tomorrow

భారీ సామర్థ్యం.. వేల ఎకరాల కేటాయింపు

ఈ డేటా సెంటర్ ఒక గిగావాట్ (1GW) కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యంతో పని చేయనుందని సమాచారం. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో భూమిని కేటాయించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.8 ఎకరాలు, తర్లువాడలో 26.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాల భూమిని ప్రభుత్వం గూగుల్‌కు అప్పగించింది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపుదిద్దుకోనున్న ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి..

ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ డేటా సెంటర్ పనులు శరవేగంగా పూర్తి చేసి 2028 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం, ఉత్తరాంధ్ర ప్రాంతం భవిష్యత్తులో గ్లోబల్ టెక్ హబ్‌గా మారడానికి ఈ డేటా సెంటర్ పునాది కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

స్టాండప్ కమెడియన్ షో అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. పాత జోకులపై రగడ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha