AP Rajyasabha Ticket: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాల (Rajya Sabha Seats) ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది.
అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ బలాన్ని బట్టి ఈ నాలుగు స్థానాలు కూడా అధికార పక్షానికే దక్కడం నల్లేరుపై నడకే కావడంతో, పెద్దల సభకు వెళ్లేందుకు కూటమి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నమ్మకస్తులైన కిలారు రాజేశ్, విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ కోటాలో చింతకాయల విజయ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి పార్టీ సీనియర్ వాయిస్ వర్ల రామయ్య, రాయలసీమ ప్రాంత కోటా నుంచి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పార్లమెంట్‌కు వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Read Also : ఏపీలో 5 జిల్లాల్లో దంచికొడుతున్న వర్షం!

మిత్రపక్షాల కోటా – చంద్రబాబు మార్క్ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి?
మరోవైపు కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు కూడా తమకు ఒక్కో స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరు రేసులో ముందుండగా, భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీ పడుతున్నట్లు సమాచారం. నాలుగు సీట్లలో మిత్రపక్షాలకు ఎన్ని కేటాయిస్తారు, అసలు కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై అమరావతి సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణాలు మరియు రాబోయే పొలిటికల్ మైలేజ్‌ను లెక్కలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఢిల్లీ టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

