Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో రుతుపవనాల జోరు: పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

ఏపీలో రుతుపవనాల జోరు: పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

వార్త 2 months ago

AP Rain Update : ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు విజయవంతంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చాయి.

అయితే, శనివారం ఉదయం నుంచి కోనసీమ, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పిడుగుల హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కోనసీమలో దంచికొట్టిన వాన: నిలిచిన విద్యుత్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రధాన గ్రామాలు జలమయమయ్యాయి. ఈదురు గాలుల తాకిడికి పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో లోతట్టు ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, ఈ తొలకరి జల్లులు తమ కొబ్బరి తోటలకు ఎంతో మేలు చేస్తాయని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Kesineni Nani: కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

 AP Rain Update

AP Rain Update : కర్నూలులో చేరిన వరద నీరు: ‘యోగాంధ్ర’ కార్యక్రమం రద్దు

కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రాజు విహార్ కూడలి, సి.క్యాంప్, గాయత్రి ఎస్టేట్, నంద్యాల చెక్‌పోస్ట్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపించాయి. వర్షం కారణంగా చారిత్రక కొండారెడ్డి బురుజు వద్ద ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, పాణ్యం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏడు రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha