AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలకు రాజకీయ పార్టీలు శరవేగంగా సన్నద్ధమవుతున్నాయి.
ఇటీవల తుని వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి శ్రేణులకు స్పష్టమైన కార్యాచరణను నిర్దేశించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ పనితీరు, ప్రజాదరణతో కూటమి గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని, దీనిని ఓట్ల శాతంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం (TDP), జనసేన (JSP), భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ సైతం ఈ పల్లె పోరులో తమ సత్తా చాటడానికి ఉత్సాహంగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడే ఎన్నికల హీట్ గరిష్ట స్థాయికి చేరింది.
Read Also : తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం!

ఏకగ్రీవాలకు బ్రేక్.. పట్టు కోసం వైసీపీ ప్లాన్
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎన్నికల్లో ఎక్కడా కూటమి పార్టీలకు ‘ఏకగ్రీవాలు’ (Unanimous Elections) దక్కనివ్వకూడదని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వార్డు, ప్రతి పంచాయతీలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి గట్టి పోటీ ఇవ్వాలని క్యాడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఊపందుకోవడంతో పాటు, రానున్న సెప్టెంబర్-డిసెంబర్ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుందనే అంచనాల మధ్య గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల వేట, రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

