Sai Sudha Play School :తిరుపతి నగరంలోని చిన్నారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ముందస్తు విద్యాభ్యాసాన్ని అందించాలనే సంకల్పంతో సరికొత్తగా ఏర్పాటు చేసిన 'సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్' ఘనంగా ప్రారంభమైంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల చెంత వెలిసిన ఈ నూతన ఏసీ ప్రాంగణాన్ని సోమవారం అమెరికా (USA) కు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు కలిసి వైభవంగా ప్రారంభించారు.
Read Also: Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి!
యూఎస్‌ఏకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రేఖ రాళ్లపల్లి (MD, USA), రామ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ (USA) అధ్యక్షులు గుడివాడ వెంకట రామనాయుడు, డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి (MD, USA)లతో పాటు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, మాస్టర్ అభిషేక్ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాసంస్థ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వారు రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన గావించి క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ వేడుకకు రాజకీయ, సామాజిక, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
నైతిక విలువలతో కూడిన ఆధునిక బోధన..
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో విద్యార్థులు చిన్నతనం నుంచే అత్యుత్తమ విద్యా పునాదులను కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. నగరాలకే పరిమితమైన ఇటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సదుపాయాలు భక్తుల కేంద్రమైన తిరుపతిలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. చిన్నారులలో కేవలం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విద్యాసంస్థల అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను కేవలం పరీక్షల కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థలు పనిచేయాలని ఆకాంక్షించారు.
పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత విద్య, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించనున్నట్లు వెల్లడించారు.
Sai Sudha Play School: స్మార్ట్ లెర్నింగ్, సురక్షిత వాతావరణం..
ప్లే స్కూల్ ఇన్‌ఛార్జ్‌లు భార్గవి, రేవతి మాట్లాడుతూ.. చిన్నారుల మేధో వికాసంతో పాటు వారి భావోద్వేగ, సామాజిక వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు అధునాతన ఏసీ తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు, సురక్షితమైన క్రీడా వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ప్రారంభోత్సవం అనంతరం అతిథులు పాఠశాల భవనం, డిజిటల్ తరగతి గదులు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థలాలను పరిశీలించారు. పాఠశాల కల్పించిన మౌలిక వసతులు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను వారు మనసారా అభినందించారు. కార్యక్రమం ముగింపులో అతిథులను యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, పుష్ప భార్గవి, రేవతి, రాజశేఖర్, లక్ష్మి, కళ్యాణి, భువనేశ్వరి, రాధ, భార్గవి, ఆశీఫా, శకుంతల, శారద, సుజిత, మహేశ్వరి, ధనలక్ష్మి, ద్రాక్షాయణి, కిరణ్, మున్వార్ బాషా, వెంకట ముని, బాబు రెడ్డి, రామచంద్ర రెడ్డి, రాజేంద్రప్రసాద్, వివేక్, సురేష్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

