Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో VB-G RAM G సిబ్బందికి వేతనాలు పెంపు ?

ఏపీలో VB-G RAM G సిబ్బందికి వేతనాలు పెంపు ?

వార్త 1 week ago

VB-G RAM G : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ మరియు వార్డు సచివాలయాల (VB-G RAM G) సిబ్బందికి త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. సచివాలయ ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు గ్రేడ్ల ఫిక్సేషన్ ప్రక్రియకు సంబంధించి త్వరలోనే అధికారిక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.

క్రమబద్ధీకరించిన సిబ్బందికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే బేసిక్ పే-స్కేల్ వర్తింపజేయడం, దానికి అనుగుణంగా జీతాలను సవరించడంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా, విధి నిర్వహణలో ప్రతిభ చూపించే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రత్యేకమైన ప్రమోషన్ పాలసీని తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనివల్ల సచివాలయ వ్యవస్థలోని వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక లబ్ధితో పాటు ఉద్యోగ భద్రత మెరుగుపడనుంది.

ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి FTE హోదా.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు!

మరోవైపు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విషయంలోనూ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. వీరిని ‘ఫుల్ టైమ్ ఈక్వివలెంట్’ (FTE)లుగా పరిగణించి, వారి వేతనాలు మరియు భద్రతపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురానున్నారు. అలాగే, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై మరియు విధి నిర్వహణలో దురదృష్టవశాత్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని గణనీయంగా పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ కీలక మార్పులన్నింటినీ రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.

పిల్లల హక్కులను కాలరాసే వారిపై కఠిన చర్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha