APSCPCR Chairman: పిల్లల హక్కులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడైనా పిల్లలపై వేధింపులు, దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ లేదా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ( APSCPCR Chairman Vetukuri AVS Suryanarayana Raju ) పిలుపునిచ్చారు.
నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి చిన్నారి సురక్షితంగా, విద్యావంతుడిగా ఎదిగేలా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
విస్తృత అధ్యయనం - ప్రత్యేక కార్యాచరణ
పిల్లల్లో పెరుగుతున్న చెడు అలవాట్లు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మరియు చిన్నారులను నేర కార్యకలాపాలకు వినియోగించే ధోరణిపై కమిషన్ సభ్యులతో కలిసి అధ్యయనం నిర్వహించినట్లు (APSCPCR Chairman Vetukuri AVS Suryanarayana Raju0 తెలిపారు. ఈ సమగ్ర నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, అందులోని సూచనల ఆధారంగా పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తామన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
విద్యా హక్కు అమలు & సంక్షేమ పథకాలు
ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన సీట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి చిన్నారి చదువును కొనసాగించేలా కృషి చేస్తున్నామని (APSCPCR Chairman Vetukuri AVS Suryanarayana Raju) పేర్కొన్నారు.ఇటీవల విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 17 మంది చిన్నారులను గుర్తించి సంరక్షణ గృహాలకు తరలించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
APSCPCR Chairman: నేరస్థులపై కఠిన చర్యల హెచ్చరిక
బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారు, బాల్య వివాహాలకు పాల్పడే వారు, చిన్నారులను గంజాయి, మద్యం అక్రమ రవాణాకు వినియోగించే ముఠాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో చైల్డ్ లైన్-1098, పోలీసు శాఖ, ఐసీడీఎస్ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్లు చేపడతామని వివరించారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అతి త్వరలో 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు - మంత్రి లోకేష్

