AP Weather updates:ఆంధ్రప్రదేశ్ లో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా మన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి ప్రాంతాలలో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
పోలవరం పరిసర ప్రాంతాలలో కూడా వాతావరణం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
Read also: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల నిరీక్షణ..!
ap weather rains today update
తేలికపాటి జల్లులు పడే అవకాశం
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఆకాశం మేఘాలతో కూడి ఉండటం వలన ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ప్రయాణాలు చేసే సమయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
AP Weather updates:ప్రజలకు ముందస్తు హెచ్చరికలు
వర్షాల ప్రభావం ఉండే ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. అత్యవసర సమయాలలో సహాయం కోసం అధికారిక హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చునని వెల్లడించారు. వాతావరణ సమారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సురక్షిత ప్రాంతాలలో ఉండాలని కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని జిల్లాల యంత్రాంగాలు ముందస్తు చర్యలలో భాగంగా అప్రమత్తంగా ఉన్నాయి.
Epaper: epaper.vaartha.com

