Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలోని వితంతువులకు శుభవార్త

ఏపీలోని వితంతువులకు శుభవార్త

వార్త 2 weeks ago

AP Pension : ఆంధ్రప్రదేశ్‌లో జూన్ నెల నుండి కొత్తగా 5,606 మంది మహిళలకు స్పౌజ్ కేటగిరీ (భర్త మరణించిన తర్వాత భార్యకు బదిలీ అయ్యే విభాగం) కింద వితంతు పెన్షన్లు మంజూరయ్యాయి.

జూన్ 1వ తేదీనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62.34 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరియు ఇతర లబ్ధిదారులకు ఒకే రోజు పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ విడత సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా Rs.2,728 కోట్ల భారీ బడ్జెట్‌ను విడుదల చేసింది. ఒకటో తేదీ ఉదయాన్నే సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ నగదును అందజేయనున్నారు. కొత్తగా పెన్షన్లు అందుకుంటున్న వితంతు కుటుంబాల్లో ఈ నిర్ణయం కొండంత భరోసాను నింపింది.

Read Also : ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..?:మంత్రి !

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పండుగను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కొన్ని లక్షల మంది అర్హులకు కొత్తగా సామాజిక భద్రత పెన్షన్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో అర్హత ఉండి, గతంలో సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. జూన్ 12న జరిగే ఈ అధికారిక ప్రకటనతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha