Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీటీఎఫ్ 1938 లోకి భారీగా చేరిన ఉపాధ్యాయులు.. ప్రభుత్వంపై పోరుకు సై!

ఏపీటీఎఫ్ 1938 లోకి భారీగా చేరిన ఉపాధ్యాయులు.. ప్రభుత్వంపై పోరుకు సై!

వార్త 1 week ago

Kalyandurg APTF Teachers: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257కు చెందిన పలువురు జోన్ నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938లో చేరడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఐదు మండలాల పరిధిలోని సుమారు 180 మంది ఉపాధ్యాయులు సభ్యత్వం స్వీకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 తన బలం పెంచుకు న్నట్లు ఉద్యోగ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం స్థానిక వివేకానంద కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 కళ్యాణదుర్గం జోన్ ప్రాంతీయ సమావేశం జిల్లా అధ్యక్షులు జి. రవీంద్ర అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయ రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన నాయకులు, వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Read Also: Bhogapuram Airport Road Tension: భోగాపురంలో అమానుషం..నష్టపరిహారం అడిగితే జేసీబీ బకెట్‌లో ఎక్కించి నెట్టేస్తారా?

 Around 180 school teachers taking membership and joining APTF 1938 union in Anantapur district

లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం, కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257కు రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్(Kalyandurg APTF Teachers) ఫెడరేషన్ 1938లో సభ్యత్వం స్వీక రించారు. సంఘం పోరాట పటిమ, ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర ఉద్యమ స్ఫూర్తి తమను ఆకర్షించిందని వారు పేర్కొన్నా రు. భవిష్యత్తులో సంఘ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావే శంలో పలు కీలక తీర్మానాలు ఆమో దించారు. విద్యా శాఖలో బోధనే తర పనుల భారం తగ్గించడం, 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించ డం, 30 శాతం మధ్యంతర భృతి ప్రక టించడం, పెండింగ్ కరవు భత్యాలు విడుదల చేయడం, ప్రమోషన్ల సమస్య పరిష్కారం, తెలుగు మాధ్యమ పాఠశాలల కొనసా గింపు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష మినహాయింపు, బహుళ విధుల సిబ్బంది, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముం దుంచారు. అలాగే జాతీయ విద్యా విధానం-20 20ను రద్దు చేసి ప్రజాతంత్ర విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో బి. వెంకటేశు లు, బీసీ తిమ్మప్ప, బొమ్మయ్య, చెన్న కేశవ, భువనేంద్ర, జగదీష్, మహేష్, సంగప్ప, ఎం. కృష్ణ, మురళి, శ్రీనివాసు లు, వీరాంజనేయులు, శ్రీదేవి, కామాక్షి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha