Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏప్రిల్ 1 నుండి రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధం: గ్లోబల్ మార్కెట్‌లో కలకలం

ఏప్రిల్ 1 నుండి రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధం: గ్లోబల్ మార్కెట్‌లో కలకలం

వార్త 3 months ago

ష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. మధ్యప్రాచ్య సంక్షోభం: ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది.

ఇది ధరల హెచ్చుతగ్గులకు దారితీస్తోంది. వేసవి కాలంలో మరియు వ్యవసాయ పనుల నేపథ్యంలో రష్యాలో ఇంధన డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయంగా కొరత రాకుండా ఈ చర్యలు చేపట్టారు. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై (Refineries) ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ముమ్మరం చేయడంతో ఉత్పత్తిపై కొంత ప్రభావం పడింది.

Read Also: Bangalore Crime: బావమరిదిని చంపి శవంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన వ్యక్తి

 Russian Gasoline

Russian Gasoline: నాలుగు నెలల పాటు గ్యాసోలిన్ ఎగుమతులు నిలిచిపోనున్నాయి

ఈ నిషేధం ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమై జూలై 31, 2026 వరకు అమల్లో ఉంటుంది. అంటే సుమారు నాలుగు నెలల పాటు రష్యా నుండి గ్యాసోలిన్(Gasoline) ఎగుమతులు నిలిచిపోనున్నాయి. గత ఏడాది రష్యా రోజుకు సుమారు 1.17 లక్షల బ్యారెళ్ల గ్యాసోలిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. రష్యా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతుండగా, రష్యా ఎగుమతుల నిషేధం మంటకు ఆజ్యం పోసినట్లవుతుంది. అయితే, రష్యా తన ముడి చమురు శుద్ధి పరిమాణాలు గత ఏడాది స్థాయిలోనే ఉన్నాయని, సరఫరాలో స్థిరత్వం ఉంటుందని భరోసా ఇచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత్‌కు మరో రెండు ఎల్‌పీజీ నౌకలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha