Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏప్రిల్ 1 నుండి ఉచిత విద్యుత్ అమలు!

ఏప్రిల్ 1 నుండి ఉచిత విద్యుత్ అమలు!

వార్త 2 months ago

AP Govt Schemes: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోంది. అల్పాదాయంతో తమ జీవితాలను నెట్టుకొస్తున్న నేతన్నలకు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వరాన్ని ప్రసాదించింది.

ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దేశంలో వ్యవసాయం రంగం తర్వాత ఎక్కువగా ఆధారపడే రంగంగా చేనేత రంగం ప్రసిద్ధిగాంచింది. ఈ రంగంలో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా నేతన్నల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

Read Also: AP Weather Alert: రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

 AP Govt Schemes: Free electricity implementation from April 1!

కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి వథంలో పయనిస్తోంది. నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ యేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వచ్చింది. మగ్గంపై వస్త్రాలు నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాల నేతన్నలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుంది.

11,971 పవర్ లూమ్స్ సర్వీసులు

సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాల్లో 29,075 హ్యాండ్ లూమ్స్ సర్వీసులు, 11,971 పవర్ లూమ్స్ సర్వీసులు ఉన్నాయి. మొత్తం మీద ఈ పథకం ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 41,046 మంది నేతన్నలు విద్యుత్ బిల్లుల కోసం యేడాదికి చెల్లించాల్సిన రూ. 25.56 కోట్లు మొత్తాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.

అవసరమైన చర్యలు చేపట్టడం

సంస్థ పరిధిలో నేతన్నల విద్యుత్ సర్వీసులకు మెరుగైన సేవలందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ కృషి చేస్తోంది. నేతన్నల విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతోంది. మగ్గాలు, పవర్ లూమ్స్ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లోడ్ కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్ సర్వీసులకు కెపాసిటర్ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు అనుగుణంగా నేతన్నల అభివృద్ధే లక్ష్యంగా ఏపీఎస్పీడీసీఎల్ కృషి చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత చారిత్రాత్మకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha