Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. హౌతీలపై భారీ ఆపరేషన్‌కు సౌదీ సిద్ధం!

ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. హౌతీలపై భారీ ఆపరేషన్‌కు సౌదీ సిద్ధం!

వార్త 6 days ago

Saudi Arabia: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌ను నియంత్రిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులపై భూ మరియు సముద్ర మార్గాల ద్వారా సర్వతోముఖ దాడికి సౌదీ అరేబియా పావులు కదుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఎర్ర సముద్రంలో తమ కీలకమైన చమురు ఎగుమతి నౌకలపై హౌతీలు నెలకొల్పిన దిగ్బంధనాన్ని భగ్నం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.

బహుళజాతి నౌకాదళ కూటమి ఏర్పాటు

ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్‌లో భాగంగా సౌదీ తన సైన్యాన్ని తూర్పు యెమెన్ నుంచి వెనక్కి పిలిపించి, మధ్య యెమెన్ ప్రాంతంలో భూతల పోరాటం కోసం మోహరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందబ్ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలో ఒక భారీ బహుళజాతి నౌకాదళ కూటమి రూపుదిద్దుకుంటోంది. ఈ కూటమికి టర్కీ, పాకిస్థాన్, ఈజిప్ట్, సూడాన్‌తో సహా సుమారు 14 దేశాలు మద్దతు పలికాయని సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి అగ్రరాజ్యాలు సైతం ఈ కూటమిలో భాగస్వాములు కావాలని సౌదీ ఆహ్వానించింది.

Saudi Arabia: హౌతీల దూకుడు – సౌదీ నౌకలపై దిగ్బంధనం

యెమెన్ రాజధాని సనాతో పాటు వ్యూహాత్మక ఎర్ర సముద్ర తీర ప్రాంతాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్న ఇరాన్ మద్దతు గల హౌతీలు, జులై 20న సౌదీ నౌకలపై దిగ్బంధనం విధిస్తున్నట్లు ప్రకటించారు. తమ దేశంపై సౌదీ అరేబియా విధించిన ఆంక్షలు ఎత్తివేస్తేనే తాము సముద్ర మార్గాలను వదిలిపెడతామని వారు హెచ్చరిస్తున్నారు. జులై 25న సౌదీలోని ప్రధాన చమురు రవాణా కేంద్రాలపై దాడులు చేశామని హౌతీలు ప్రకటించడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చింది.

సౌదీ ఆర్థిక వ్యవస్థకు ఎర్ర సముద్ర మార్గమే కీలకం

ఇప్పటికే హర్మూజ్ జలసంధి మార్గం వివాదాస్పదంగా మారడంతో, సౌదీ అరేబియాకు ఎర్ర సముద్ర మార్గమే చమురు ఎగుమతులకు అత్యంత ప్రాణాధారంగా మారింది. ప్రస్తుతం సౌదీ నుంచి జరుగుతున్న మొత్తం చమురు ఎగుమతుల్లో సగం కంటే ఎక్కువ వాటా యాన్బు పోర్టు ద్వారానే సాగుతోంది. ఈ కీలక మార్గాన్ని కూడా హౌతీలు పూర్తిగా మూసివేస్తే సౌదీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో, రియాద్ ప్రభుత్వం ఈ దూకుడు నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసిన ఇరాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha