Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎర్రబస్సు రానిచోటుకు ఎయిర్పోర్టు వచ్చింది - నారా లోకేష్

ఎర్రబస్సు రానిచోటుకు ఎయిర్పోర్టు వచ్చింది - నారా లోకేష్

వార్త 6 days ago

Bhogapuram Airport : స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్రమైన పుణ్యభూమి ఉత్తరాంధ్ర అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ సభా ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కొందరు నాయకులు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను ఎంతో తక్కువగా చూసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. “సరిగా ఎర్రబస్సు కూడా రాని ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమా?” అని కొందరు ఎద్దేవా చేశారని లోకేష్ గుర్తుచేశారు. ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ, ఉత్తరాంధ్ర ప్రజల సామర్థ్యాన్ని, ఈ ప్రాంత ప్రాధాన్యతను నేడు నిరూపించామని ఆయన స్పష్టం చేశారు.

ఎర్రబస్సు రాని చోట ఎయిర్‌బస్, నమో ప్రవేశం - ప్రగతి పథంలో ఉత్తరాంధ్ర

గతంలో ఎర్రబస్సు రావడానికే ఇబ్బందులు ఎదుర్కొన్న ఇదే భోగాపురం నేల పైకి నేడు ఏకంగా ‘ఎయిర్‌బస్’ విమానాలు ల్యాండ్ అయ్యే స్థాయికి ఎదిగిందని మంత్రి లోకేష్ సగర్వంగా ప్రకటించారు. “ఎర్రబస్సు రాని చోటుకే ఈరోజు ఎయిర్‌పోర్ట్ వచ్చింది, ఎయిర్‌బస్ విమానాలు వచ్చాయి.. అంతకుమించి మన ప్రధాని నమో గారు (నరేంద్ర మోదీ) స్వయంగా విచ్చేశారు” అని వ్యాఖ్యానిస్తూ సభలో ఉత్సాహాన్ని నింపారు. సీఎం చంద్రబాబు నాయుడి సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై వెనుకబడిన ప్రాంతంగా కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక మరియు ఆర్థిక రంగానికి ప్రధాన చోదక శక్తిగా మారబోతోందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులు: ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో సర్వీసులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha