Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

వార్త 1 month ago

Asian Games 2026: జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. పూల్-Bలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై భారత్ ఏకంగా 19-0 తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.. ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం కూడా దక్కలేదు.

Read Also :Asian Games 2026: ఆసియా క్రీడల్లో జపాన్‌కు తొలి స్వర్ణం

దీపిక అద్భుత ప్రదర్శన

ఈ భారీ విజయంలో భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక కీలక పాత్ర పోషించింది. ఆమె ఒక్కరే ఏకంగా 8 గోల్స్ సాధించి ప్రత్యర్థి రక్షణను ఛేదించింది. ఇషికా మూడు గోల్స్‌తో రాణించగా.. ఇతర భారత ఆటగాళ్లు కూడా తమ వంతు సహకారం అందించారు.

Asian Games 2026: తొలి అర్ధభాగంలోనే ఆధిపత్యం

భారత్ మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 8-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ గోల్స్ వరద కొనసాగించడంతో చివరకు 19-0తో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు ఏషియన్ గేమ్స్‌లో శుభారంభం చేసింది. టోర్నీలో తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha