Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎసిబి వలలో మున్సిపల్ ఇన్ ఛార్జ్ ఆరోగ్యాధికారి డి.లక్ష్మీనరసింహ, జూనియర్ అసిస్టెంట్ సందీప్

ఎసిబి వలలో మున్సిపల్ ఇన్ ఛార్జ్ ఆరోగ్యాధికారి డి.లక్ష్మీనరసింహ, జూనియర్ అసిస్టెంట్ సందీప్

వార్త 3 months ago
  • శానిటేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి 25 వేలు లంచం డిమాండ్

Anantapur ACB Trap: నగరపాలక సంస్థలో ఇన్ఛార్జ్ ఆరోగ్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డి.

లక్ష్మీనరసింహ, ఆరోగ్య విభాగపు జూనియర్ అసిస్టెంట్ సందీప్లు ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం శానిటేషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఎగ్జిబిషన్ నిర్వాహకుని వద్ద నుంచి రూ.25వేలు లంచం తీసకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

Read also: Himanta Biswa Sarma: అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, నారా కుటుంబానికి ఘన స్వాగతం!

ACB trap Anantapur municipal office

Anantapur ACB Trap: రైతు బజార్ వద్ద సీన్ రివర్స్

సోమవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు వీరి సంభాషణలను పూర్తిస్థాయిలో రికార్డు చేసకుంటూ మద్యాహ్నం స్థానిక రైతు బజారు వద్ద జూనియర్ అసిస్టెంట్ సందీప్ 25వేలు లంచం తీసుకుంటుండగా నేరుగా ఏసీబీ డీఎస్పీ ప్రసాదొడ్డి బృందం పట్టుకుంది. అనంతరం సంబంధిత పర్యవేక్షణాధికారి ఆదేశాల మేరకు లంచం తీసకుంటున్నట్లు జూనియర్ అసిస్టెంట్ తెలుపగా నగరపాలకసంస్థ కార్యాలయానికి చేరుకొని ఇన్ఛార్జ్ ఆరోగ్యాధికారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పోలీస్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం: హోంమంత్రి అనిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha