Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీస్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం: హోంమంత్రి అనిత

పోలీస్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం: హోంమంత్రి అనిత

వార్త 1 week ago

కంకిపాడు మోడల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి అనిత

Kankipadu News: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ మోలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు.

కృష్ణా జిల్లా కంకిపాడులో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన, సాంకేతిక సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో వాహనాల పార్కింగ్, మొదటి అంతస్తులో పోలీస్ స్టేషన్ కార్యాలయం, రెండో అంతస్తులో సర్కిల్ కార్యాలయం, మూడో అంతస్తులో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు.

Read also: Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదు

 Kankipadu Model Police Station Launch

ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన హోంమంత్రి అనితకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి, రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతి అంతస్తులోని గదులు, సాంకేతిక వనరులు, ప్రజలకు అందించనున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 25 ఐపీ ఆధారిత లైవ్ కెమెరాలను కూడా హోంమంత్రి ప్రారంభించారు. మానిటరింగ్ స్టేషన్ ద్వారా వాటి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.

Kankipadu News: మూడు అంతస్తుల్లో వినూత్న సదుపాయాలు

అలాగే గన్నవరం నియోజకవర్గం లోని ఆత్కూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను కూడా హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.1.20 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మహిళలపై నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణలో జిల్లా రాష్ట్రవ్యాప్తంగా నాలుగో స్థానం పొందడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

మహిళల భద్రతలో జిల్లాకు అగ్రస్థానం

మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ఎస్పీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోలీసింగ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష ్యమని హోంమంత్రి పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన పోలీస్ స్టేషన్లు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తాయని, మహిళలు, చిన్నారులు భయపడకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చి తమ సమస్యలను తెలియజేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి గారు, జనసేన జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, ఎంపీపీ విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ ఎస్పీ విద్యాసాగర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha