Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎట్టకేలకు రాజధాని ఏర్పాటు

ఎట్టకేలకు రాజధాని ఏర్పాటు

వార్త 1 month ago

Vaartha Sanghibavam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి సుమారు దశాబ్ద కాలం దాటిన తరువాత ఎట్టకేలకు అమరావతి రాజధానిగా ఏర్పాటుకు చట్టబద్ధమైన వెసులుబాటు కలిగింది.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మార్చే ప్రమాదం ఉండటంతో ఏకంగా కేంద్రం నుంచి చట్టబద్ధమైన నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చారు. మరోపక్క రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతు న్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సకాలంలో అమరావతి పూర్తి స్థాయి నిర్మాణా నికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా, వివాదాలకు దూరంగా ఉంటే మంత్రి నారాయణ సిఆర్ డిఏకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటిదాకా అమరావతి ప్రభుత్వ ఉత్తర్వులకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఎప్పుడైతే పార్లమెంటు స్థాయి నుంచి ఆమోదం లభించిందో ఒక శాశ్వత గుర్తింపు లభించినట్టైంది.

దీనికి అనుగుణంగా తపాలాశాఖ అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ (పోస్టల్ ఇన్డెక్స్ నంబర్)ను కేటాయించడానికి అనుమతి కూడా లభించింది. దేశ పార్లమెంటులో రాజ్యాంగబద్ధంగా విభజన చట్టాన్ని సవరించి అమరావతి రాజధాని అనే మార్పును తీసుకురావడం విశేషం. ఇది కేవలం కాగితం మీద పేరు మార్పు కాదు. అమరావతి చుట్టూ ఒక అభేద్య మైన రక్షణ కవచం. ఈ సవరణతో అమరావతి నిర్ణయా ధికారం రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర చట్టం పరిధిలోకి వెళ్లింది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక అసెంబ్లీ తీర్మానంతో రాజధానిని మార్చడం అసాధ్యం! అది మారాలంటే మళ్లీ దేశ పార్లమెంటే ఆమోదించాలి. అమరావతి ఇప్పుడు ఏపీ రాజధాని మాత్రమే కాదు.. కేంద్ర గెజిట్లో నమోదైన అజేయమైన నగరంగా పేర్కొనవచ్చు. భూము లిచ్చిన రైతులతో జరిగిన ఒప్పందాలకు ఈ సవరణ ఒక సావరీన్ గ్యారెంటీగా నిలుస్తుంది. న్యాయపరమైన చిక్కుల న్నింటికీ ఈ ఒక్క గెజిట్ నోటిఫికేషన్ శాశ్వత ముగింపు పలికినట్టైంది. దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని నగరం ఉంటుంది. అక్కడి నుంచే ప్రభుత్వ పాలన సాగు తుంది. ఇది గతం నుంచి అమలులో ఉంది. అదేవిధంగా జిల్లాలకూ జిల్లా కేంద్రం ఉంటుంది. ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన కేంద్రాలు, రాష్ట్ర రాజధాని అంటే ప్రభుత్వం యంత్రాంగం, పాలనా వ్యవస్థ, అత్యు న్నత న్యాయ వ్యవస్థలు అక్కడే ఏర్పాటు అవుతాయి.

Vaartha Sanghibavam: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా 2014లో విడిపోయింది. అప్పటిదాకా రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు పరిమితమైంది. దీనితో ఆంధ్రప్రదేశకు మరో రాజధానిని ఏర్పాటు చేసుకోవల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రం విడిపోవడంతో ఒక్కసారిగా పాలనా వ్యవస్థను మార్చుకోవడం సమస్యలు ఉంటాయి కాబట్టి పదేళ్ల పాటు ఉమ్మడిగా హైదరాబాద్ను ఉపయోగించుకోవచ్చని విభజన చట్టంలో స్పష్టం చేశారు. ఆ లోగా రాజధానిని ఏర్పాటుచేయడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గతంలో కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ తరువాత హైదరాబాద్కు మార్చడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తరువాత కర్నూలును తిరిగి రాజధానిగా చేయాలన్న ఆలోచనలు వచ్చినప్పుడు భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలకు రాజధాని అందుబాటులో ఉండదని భావించారు. దీనితో విజయ వాడ, గుంటూరుకు సమీపంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో అంగీకరించారు. మొదటి 5 సంవత్సరాల్లో పనులు సుమారు 40 శాతం వరకు పూర్తయ్యాయి. కొన్ని పునా దుల దశలో ఉన్నాయి. హైకోర్టు నిర్మాణం పూర్తి చేసు కుంది. ఇక అధికారులు, న్యాయమూర్తులు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం చురుగ్గా సాగుతున్న తరుణంలో 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొంది వైసీపీ అధికారం లోకి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరింపచేయాలని నిర్ణయించారు. దీనితో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంను, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలును, అసెంబ్లీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అనుకున్న స్థాయిలో పనులు ఎక్కడా జరగలేదు. ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగానే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పొందింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు అమరావతిని రాజధాని చేయడానికి పావులు కదిపి పార్లమెంటు స్థాయిలో చట్టబద్ధతను పొందేలా చేశారు.

-డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మసకబారుతున్న దర్యాప్తు సంస్థ ప్రతిభ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha