Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎట్టకేలకు టెకీ రాధాగాయత్రి కేసులో భర్త అరెస్ట్!

ఎట్టకేలకు టెకీ రాధాగాయత్రి కేసులో భర్త అరెస్ట్!

వార్త 0 months ago

Radha Gayatri Death Case: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (టెకీ) రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పురోగతి లభించింది.

భార్య మరణానికి కారణమయ్యాడనే బలమైన ఆరోపణలతో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. విహారయాత్రకు వెళ్లిన చోట జరిగిన ఈ విషాద ఘటన రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించగా.. తాజాగా భర్త అరెస్టుతో ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also : Odisha ATM Robbery: సినిమా స్టైల్‌లో దోపిడీ.. థార్ కారుకు కట్టి ATM మిషన్‌ను ఈడ్చుకెళ్లిన దొంగలు

 Husband arrested in Visakhapatnam techie Radha Gayatri case!

Radha Gayatri Death Case: ముస్సోరీ హోమ్ స్టేలో దారుణం

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఐటీ ఉద్యోగిని రాధాగాయత్రి, ఆమె భర్త శ్రీచరణ్ కలిసి గత నెలలో ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీకి విహారయాత్రకు (టూర్‌కు) వెళ్లారు. అక్కడ వారు ఒక ప్రైవేట్ హోమ్ స్టేలో బస చేశారు. అయితే, అంతా సంతోషంగా సాగుతుందనుకున్న తరుణంలో, రాధాగాయత్రి ఆ హోమ్ స్టేలోనే అత్యంత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణంపై భర్త చెప్పిన వివరాలు పొంతన లేకుండా ఉండటం, రాధాగాయత్రి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

డీఎస్పీ నేతృత్వంలో విచారణ.. కటకటాల్లోకి భర్త!

ఈ హైప్రొఫైల్ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉత్తరాఖండ్ పోలీస్ యంత్రాంగం దర్యాప్తును వేగవంతం చేసింది. ముస్సోరీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) జేసీ పంత్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. హోమ్ స్టేలోని ఆధారాలు, వైద్య నివేదికలు, ప్రాథమిక విచారణలో భర్త శ్రీచరణ్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే టూర్‌కు వెళ్లి యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక అసలు కారణాలు ఏంటి? ఇది ఆత్మహత్యా లేక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యా? అనే కోణంలో డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో పోలీసులు శ్రీచరణ్‌ను విచారిస్తున్నారు. పూర్తి నివేదిక వస్తే గానీ ఈ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడదు.

జైపూర్‌లో దారుణం: కారుతో తొక్కించి తల్లిని చంపిన కూతురు.. ఏడాది క్రితం తండ్రిని కూడా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha