Dailyhunt
ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి!

ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి!

వార్త 2 weeks ago

Narasaraopet Lodge Suicide Case: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక దినేష్ గ్రాండ్ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో తల్లి శంకర కుమారి, ఐదేళ్ల కుమార్తె మౌనిక అక్కడికక్కడే మృతి చెందారు. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Read Also:Gujarat Crime: యజమానురాలిని చంపిన పనిమనిషి.. కారణమిదే?

ఎయిమ్స్ వైద్య దంపతుల ఘాతుకం.. అసలేం జరిగింది?

పోలీసుల ప్రాథమిక విచారణలో బాధితులను నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భర్త గోపి భోపాల్ ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, భార్య శంకర కుమారి అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు చేరుకున్న ఈ కుటుంబం, లాడ్జిలో గది తీసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వైద్య వృత్తిలో ఉన్న వారు కావడంతో, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Narasaraopet Lodge Suicide Case:దర్యాప్తు చేపట్టిన పోలీసులు

 While his wife and daughter have died, the doctor’s condition remains critical.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భోపాల్ నుండి నేరుగా వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న బలమైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారి మృతి మరియు తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో సాతులూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రియుడితో కలిసి చెల్లెలిని చంపిన అక్క!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha