Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడితో కలిసి చెల్లెలిని చంపిన అక్క!

ప్రియుడితో కలిసి చెల్లెలిని చంపిన అక్క!

వార్త 2 months ago

Barabanki Crime: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో మానవ సంబంధాలు మంటగలిసేలా ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కేవలం తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో, కన్న చెల్లెలిని తన ప్రియుడితో కలిసి ఓ యువతి కిరాతకంగా అంతమొందించింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also:Kalyandurgam Sheep Death: యూరియా కలిసిన నీరు తాగి 20 గొర్రెలు మృతి

ఏకాంతంగా ఉన్న సమయంలో చూసిందని..

పోలీసుల కథనం ప్రకారం, బారాబంకిలోని ఒక గ్రామ పొలంలో నిందితురాలు తన ప్రియుడితో కలిసి ఏకాంతంగా (నగ్నంగా) ఉన్న సమయంలో, ఆమె 11 ఏళ్ల సోదరి అనుకోకుండా అక్కడికి వచ్చింది. తాము చేస్తున్న పనిని చెల్లెలు చూసిందని, ఈ విషయం ఇంట్లో వాళ్లకు లేదా ఊర్లో వాళ్లకు చెబుతుందేమోనని ఆ యువతి భయపడింది. తన పరువు పోతుందన్న ఆందోళనతో, ప్రియుడితో కలిసి ఆ బాలికను గొంతు నులిమి హతమార్చింది.

Barabanki Crime:నేరాన్ని అంగీకరించిన నిందితులు

బాలిక కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోదరిని మరియు ఆమె ప్రియుడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తామే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha