Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిరిండియా సంచలన నిర్ణయం: చికాగో, న్యూయార్క్ విమానాలు రద్దు!

ఎయిరిండియా సంచలన నిర్ణయం: చికాగో, న్యూయార్క్ విమానాలు రద్దు!

వార్త 3 months ago

Jet Fuel Price Hike: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన అంతర్జాతీయ ప్రయాణికులకు చేదువార్త వినిపించింది. పెరుగుతున్న విమాన ఇంధన (Jet Fuel) ధరల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు పలు కీలక అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి చికాగోకు, ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానాలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు ఢిల్లీ-షాంఘై మరియు దక్షిణ భారతదేశం నుంచి కీలకమైన చెన్నై-సింగపూర్ సర్వీసులను కూడా తాత్కాలికంగా పక్కన పెట్టింది.

Read Also:USA Iran Conflict: ఇరాన్‌కు అమెరికా ఆర్థిక షాక్: రూ. 145 కోట్ల బహుమతి ప్రకటన!

Jet Fuel Price Hike:పెరిగిన ఇంధన ధరల ఎఫెక్ట్‌తో ఎయిరిండియా విమానాల నిలిపివేత.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో, విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఎయిరిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎదురయ్యే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇంధన ధరలు అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలించిన తర్వాతే ఈ విమానాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టెహ్రాన్ ఆర్థిక పునాదులు కదిలేలా అమెరికా కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha