Bharti Airtel NextEra Investment: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా' (NextEra) ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించి, దేశీయ డేటా మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది.
కృత్రిమ మేధ (AI) విప్లవం నేపథ్యంలో డేటా సెంటర్ల అవసరం పెరుగుతుండటంతో ఈ పెట్టుబడి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.భారతీ ఎయిర్‌టెల్, ఇప్పుడు డేటా సెంటర్ల విభాగంలో గ్లోబల్ ప్లేయర్‌గా ఎదిగేందుకు సిద్ధమైంది. తన డేటా సెంటర్ విభాగమైన ‘నెక్స్ట్రా’ (NextEra) లో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల నుండి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,300 కోట్లు) భారీ పెట్టుబడులను ఆకర్షించింది.
Read Also: IWI Negev LMG India: భారత్ కు అత్యాధునిక మెషిన్ గన్‌లు అందజేసిన IWI
Bharti Airtel NextEra Investment: పెట్టుబడి పెట్టిన ప్రముఖ సంస్థలు
ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 435 మిలియన్ డాలర్లు, కార్లైల్ 240 మిలియన్ డాలర్లు, యాంకోరేజ్ క్యాపిటల్ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఎయిర్టెల్ సంస్థే సమకూర్చనుంది. ఈ పెట్టుబడుల తర్వాత కూడా నెక్స్ట్రాలో మెజారిటీ వాటా ఎయిర్టెల్ వద్దే ఉంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.ప్రస్తుతం నెక్స్ట్రా సంస్థకు దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, రానున్న కొన్నేళ్లలో దీన్ని 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ లో, శరవేగంగా పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, హైపర్స్కేలర్ డిమాండ్ ను, అందిపుచ్చుకోవడానికి ఈ విస్తరణ దోహదపడనుంది.
Airtel Nextra 1 Billion Dollar Investment
దేశీయ డేటా సెంటర్ మార్కెట్లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.నెక్స్ట్రా ఇప్పటికే పుణెలో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉండగా, తాజాగా చెన్నై, ముంబై, కోల్కతాలలో ఏఐ-రెడీ (AI-ready) క్యాంపస్లను నిర్మిస్తోంది. గూగుల్తో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన కోర్ డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ కేంద్రాలతో నెక్స్ట్రా తన సేవలను అందిస్తోంది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
రెండు అసెంబ్లీ స్థానాల నుండి విజయ్ పోటీ.. 'అమ్మ' రికార్డును సమం చేస్తారా?

