Airtel Recharge Plans: టెలికాం రంగానికి చెందిన ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియో నుంచి నాలుగు రీచార్జ్ ప్లాన్‌లను తొలగించింది.
వినియోగదారులు ఎంతగానో ఎంచుకునే రూ. 299, రూ. 579, రూ. 619, రూ. 649 ధరల్లో ఉన్న మిడ్-రేంజ్ ప్లాన్‌లను కంపెనీ తమ అధికారిక సైట్, యాప్‌ల నుంచి తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ప్రతిరోజూ 1.5GB డేటాను ఇచ్చే ప్లాన్‌లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
Key changes to Airtel recharge plans… 4 plans discontinued.
Airtel Recharge Plans: వినియోగదారులపై 16% అదనపు భారం
ఇప్పటివరకు అత్యధికంగా వినియోగించే రూ. 299 (28 రోజుల పరిమితి, 1.5GB/రోజు) ప్లాన్ రద్దు కావడంతో, వినియోగదారులు ఇకపై తదుపరి ప్రత్యామ్నాయంగా రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటా లభిస్తున్నప్పటికీ, రూ. 50 మేర ఛార్జీలు పెరగడం వల్ల ప్రతీ నెల రీచార్జ్‌పై దాదాపు 16 శాతం అదనపు భారం పడుతుంది. నేరుగా ధరలను పెంచకుండానే ప్రతీ వినియోగదారుని సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లను క్యాటలాగ్ నుంచి తొలగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

