FSSAI Warning To Influencers : ఆహార ఉత్పత్తులు, డైట్ టిప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు మరియు ఫుడ్ క్రిటిక్స్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) ఆదేశాల మేరకు తమిళనాడు ఆహార భద్రతా శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా, శాస్త్రీయ ఆధారాలు లేని ప్రకటనలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. పిల్లల నుండి పెద్దల వరకు లక్షలాది మంది ప్రజలు తమ అభిమాన సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్ముతుంటారు.ఇన్ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్‌లో నాణ్యత లోపించినా, హానికారక పదార్థాలు ఉన్నా ప్రజ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎలాంటి అర్హత లేదా మార్గదర్శకాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఇచ్చే హెల్త్ & డైట్ టిప్స్ వల్ల వినియోగదారులు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Ponguleti Srinivas Reddy: తెలంగాణకు పదకొండు లక్షల ఇళ్ళ బిగ్ రిక్వెస్ట్
FSSAI Warning To Influencers
FSSAI Warning To Influencers : ఆహార భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు
తమిళనాడు ఆహార భద్రతా శాఖ తన అధికారిక పోస్ట్‌లో కీలక నిబంధనలను గుర్తుచేసింది:'ఆహార భద్రత ప్రమాణాల చట్టం, 2026 (సెక్షన్ 24, 53)' మరియు 'అడ్వర్టైజింగ్ అండ్ సొలిసిటేషన్స్ రూల్స్, 2018' ప్రకారం వినియోగదారులను మోసగించే ప్రకటనలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఏదైనా బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకునే ముందే ఆ ఉత్పత్తి ప్యాకెట్‌పై ఉన్న సమాచారం నిజమా కాదా, FSSAI నిబంధనలకు లోబడి ఉందో లేదో ఇన్ఫ్లూయెన్సర్లు నిర్ధారించుకోవాలి.'రోగనిరోధక శక్తి పెరుగుతుంది', 'పోషకాలు పుష్కలంగా ఉన్నాయి' అని చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారు కాబట్టి, ప్రకటనలు చేసేవారు వినియోగదారుల నమ్మకానికి బాధ్యత వహించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు మరియు చట్టపరమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్యాకింగ్ లేబుల్స్ చూసి మోసపోకండి!
సాధారణంగా వినియోగదారులు ప్యాకెట్ వెనుక ఉండే FSSAI లైసెన్స్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్, అందులోని పదార్థాల వివరాలు చూసి కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడే భారీ అక్రమాలు జరుగుతున్నాయని తనిఖీల్లో వెల్లడైంది.ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు మరియు రోజువారీ వంటల్లో వాడే టమాటా సాస్, కెచప్, గ్రీన్ చిల్లీ సాస్, సోయాసాస్, అజీనోమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, బటర్, మయోనీస్, రాక్ సాల్ట్, చీజ్, తేనె వంటి ఉత్పత్తులను కొన్ని నకిలీ ఫ్యాక్టరీలు విచ్చలవిడిగా తయారు చేస్తున్నాయి.లేబుల్ పై నకిలీ FSSAI రిజిస్ట్రేషన్ నంబర్లు వేసి విక్రయిస్తున్నప్పటికీ, లోపల ఉండే పదార్థాల్లో నాణ్యత ఉండడం లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వినియోగదారులు కేవలం అట్టపై ఉన్న బొమ్మలు, ప్రకటనలు చూసి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
వాయిదాలకే సరిపోతున్న పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్.. రూ.216 కోట్లు వృథా

