Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి చేసుకోవాలని ప్రియుడికి వీడియో కాల్.. మాదాపూర్‌లో యువతి మృతి

పెళ్లి చేసుకోవాలని ప్రియుడికి వీడియో కాల్.. మాదాపూర్‌లో యువతి మృతి

వార్త 1 month ago

Madhapur Woman Death: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్ చేసిన యువతి అనంతరం మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Bhogapuram Airport: ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత.. రూ.4 కోట్ల గంజాయి స్వాధీనం!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతిగా గుర్తింపు

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్ చంద్రనాయక్ తండాలోని ఎస్‌ఆర్ సద్గురు రెసిడెన్సీలో నివాసం ఉంటోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన భండారి విమల్‌తో ఆమెకు గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరూ సహోద్యోగులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి విమల్ తన తల్లితో కలిసి చేర్యాలలో ఓ కార్యక్రమానికి వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు అర్చనా అతడికి వీడియో కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో విమల్ ఆందోళనకు గురయ్యాడు.

డయల్ 112కు సమాచారం

ఉదయం సుమారు 5.30 గంటలకు విమల్ అర్చనా నివాసానికి చేరుకున్నాడు. ఫ్లాట్ తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో పోలీసుల అత్యవసర సహాయ నంబర్ 112కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా అర్చనా మృతి చెందినట్లు గుర్తించారు.

Madhapur Woman Death: కేసు నమోదు చేసిన పోలీసులు

ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విమల్‌కు గతంలోనే వివాహం జరిగిందని, విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.

Epaper: epaper.vaartha.com

కొల్లూర్ ORRపై ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha