Reactor Explodes : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామంలో ఉన్న హెజిలో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
అర్ధరాత్రి సమయంలో కంపెనీలోని ఒక రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: IPS Uday Krishna Case: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్
Reactor Explodes
Reactor Explodes : ప్రమాద వివరాలు
రియాక్టర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన చెన్ను నాగిరెడ్డి (31), ఖమ్మం జిల్లాకు చెందిన నాగనబోయిన నరేష్ కుమార్ (29) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని యశోద, సన్‌షైన్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు హేజిలో ఫార్మా కంపెనీ రూ.2.8 కోట్లు చొప్పున పరిహారం ప్రకటించింది. పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద ఉన్న హేజిలో ఫార్మా కంపెనీలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతి చెందిన రాజశేఖర్, నాగరాజు కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఇదిలా ఉండగా అంతకుముందు హెజిలో కంపెనీ గేటు వద్ద అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామస్థులు ధర్నాకు దిగారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

